చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్ధం: సిబిఐ మాజీ డైరెక్టర్

-

ఈ రోజు ఉదయం సరిగ్గా 6 గంటలకు నంద్యాలలో మాజీ ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నాయకులు చంద్రబాబు అరెస్ట్ చేయడం సరైనదే, అవినీతికి పాల్పడ్డారు.. ఇంకా ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక టీడీపీ నేతలు మరియు చంద్రబాబు మద్దతుదారులు మాత్రం…. ఈయన అరెస్ట్ అక్రమం, అన్యాయం అంటూ వంకలు పెడుతున్నారు. తాజాగా సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరావు ఈ విషయంపై స్పందించారు. నాగేశ్వరావు మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా చట్ట విరుద్ధం అన్నారు.

ACP చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా సెక్షన్ 17 A (C) అనుమతిని తీసుకోవాలన్నారు నాగేశ్వరరావు. ఒకవేళ గవర్నర్ దగ్గర అనుమతి తీసుకుంటే ఓకే లేదంటే… దర్యాప్తు చెల్లుబాటు కాదని క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news