సైకిల్‌ అన్‌స్టాపబుల్‌…బాబు కలలు..!

-

జగన్ పని అయిపోయింది..ప్రజలకు వైసీపీ అరాచకాలు అర్ధమయ్యాయి.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు.. సైకిల్‌ స్పీడ్‌ అన్‌స్టాపబుల్‌ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంనుంచి సైకిల్‌ అమరావతికి చేరాలని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. ఇంకా రాబోయేది టి‌డి‌పి ప్రభుత్వమే అంటున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన టి‌డి‌పిదే విజయమని మాట్లాడుతున్నారు. సరే టి‌డి‌పి గెలవాలని బాబు అనుకోవడంలో తప్పు ఏమి లేదు. ఎందుకంటే ఒకసారి అధికారం కోల్పోయి జగన్ చేతిలో టి‌డి‌పి చావు దెబ్బతింది.

ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే ఇంకా టి‌డి‌పి మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే పార్టీని అధికారంలోకి తీసుకురావాలని బాబు కష్టపడుతున్నారు. కానీ టి‌డి‌పి గెలవాలని అనుకోవడం వేరు..గెలిచేస్తుందని అనుకోవడం వేరు. పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో బాబు మాట్లాడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా జగన్ బలంగా ఉన్నారు. ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యం ఉంది. అలాంటప్పుడు టి‌డి‌పి గెలవడం అనేది అసాధ్యమైన విషయం.

ఇచ్చిన మాట తప్పకుండా పక్కగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్‌కే ప్రజా మద్ధతు ఎక్కువ ఉంది. ప్రతి సర్వే వైసీపీకే అనుకూలంగా ఉంది. అలాంటప్పుడు సైకిల్ అన్‌స్టాపబుల్‌ అంటూ బాబు డైలాగులు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. మొదట క్షేత్ర స్థాయిలో టి‌డి‌పి నేతలు బలపడాలి. గట్టిగా చూసుకుంటే టి‌డి‌పి నేతలు 75 స్థానాల్లో బలంగా ఉంటే 100 స్థానాల్లో వీక్ గా ఉన్నారు.

పైగా టి‌డి‌పి విజయం ఆపడం ఎవరి తరం కాదని మాట్లాడే బాబు..పొత్తుల కోసం ఎందుకు తొందరపడుతున్నారనేది పెద్ద ప్రశ్న. టి‌డి‌పికి గెలిచే శక్తి ఉన్నప్పుడు జనసేనతో పొత్తు అవసరం లేదు. కానీ బాబు జనసేనతో పాటు, బి‌జే‌పిని కూడా కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు. అంటే టి‌డి‌పికి ఒంటరిగా గెలిచే బలంలేదు. ఒకవేళ జనసేనతో కలిసిన వైసీపీని దాటడం కష్టం కాబట్టి..సైకిల్ అన్‌స్టాపబుల్‌ అనేది బాబు కల మాత్రమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version