ఈ నెల 6న కాంగ్రెస్‌లోకి తుమ్మల!

-

మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారైంది. ఈనెల 6న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. శుక్రవారం రాహుల్ గాంధీ యూరప్ పర్యటనకు వెళ్లనుండటంతో… బుధవారం తుమ్మల తన ముఖ్య అనుచరులతో కలిసి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ponguleti on thummala

కాగా, కాంగ్రెస్‌ పార్టీలో చేరేంది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు తుమ్మల నాగేశ్వరరావు. నిన్న తుమ్మల ఇంటికి.. కాంగ్రెస్ ప్రచార కమిటీ కోర్ ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రావడంపై మరింత ఉత్కంఠ సంతరించుకుంది. ఈ తరుణంలోనే.. కాంగ్రెస్ పార్టీలో చేరికపై తుమ్మల క్లారిటీ ఇవ్వలేదు.హస్తం పార్టీలోకి తనను ఆహ్వానించినందుకు పొంగులేటితో భేటీ అనంతరం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలను చూడాలన్నదే తన కోరిక అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version