జగన్ బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ ? చంద్రబాబు చేతికి దొరికిన అతిపెద్ద అస్త్రం ?

-

వైఎస్ జగన్ సర్కార్ ఇటీవల రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు భూ సమీకరణ లో చేసిన పన్నెండు వందల యాభై ఎకరాల భూములను ఇళ్ల స్థలాలుగా పేదలకు పంపిణీ చేయడానికి రెడీ అయింది. ఈ సందర్భంగా క్యాబినెట్ తో సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్ సర్కార్ ఈ నిర్ణయం సీఆర్డీఏ చట్టం ఆధారంగా తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు మరియు టిడిపి నాయకులు సీఆర్డీఏ చట్టాన్ని ఇంత బాగా గౌరవిస్తున్న జగన్ సర్కార్… ఆ చట్టంలోని మిగతా అంశాలను కూడా పాటించడానికి సిద్ధంగా ఉందా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు.

సీఆర్డీఏ చట్ట ప్రకారం అమరావతిని నిర్మించబోతోందా..?  అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు టిడిపి నాయకులు. అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతిని రాజధానిగా గుర్తించాక…రాజధాని నిర్మాణం కోసమే.. క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ.. సీఆర్డీఏను.. గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజధానిని ఎలా నిర్మించాలి..? నిధుల సేకరణ ఎలా జరగాలి..? ప్రజారాజధానిగా ఎలా మార్చుకోవాలి..? అక్కడ నివసించే పేదల్ని ఎలా కాపాడుకోవాలి..? రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు.. ఎలా ప్రయోజనం కల్పించాలి.? ఇలా ప్రతి అంశంపై సమగ్రమైన విషయాలతో చట్టం రూపొందిందింది.

 

ఇటువంటి నేపథ్యంలో సీఆర్డీఏ చట్టప్రకారం ఉగాది పండుగ నాడు పేదలకు భూములు ఇస్తున్న జగన్ సర్కార్ కి అదే అస్త్రాన్ని సీఆర్డీఏ చట్టాన్ని అస్త్రంగా మలుచుకుని చంద్రబాబు జగన్ కి సెల్ఫ్ గోల్ పడేలా హై కోర్టును ఆశ్రయించనున్నట్లు టిడిపి వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. సీఆర్డీఏ చట్టాన్ని మరియు అదే విధంగా మూడు రాజధానులు నిర్ణయం విషయంలో జగన్ సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరించి శాసనమండలిని రద్దు చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో సీఆర్డీఏ చట్టాన్ని జగన్ ఉపయోగించడాన్ని చంద్రబాబు అతి పెద్ద అస్త్రంగా ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి కీలక పాయింట్ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Exit mobile version