బాబుకు కోడెల వారసుడు షాక్..టీడీపీ ఓటమే టార్గెట్.!

-

టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా దివంగత కోడెల శివప్రసాద్ కుటుంబానికి షాక్ ఇస్తూ..సత్తెనపల్లి ఇంచార్జ్ గా కన్నా లక్ష్మీనారాయణని నియమించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పెద్ద ఎత్తున టి‌డి‌పి అధిష్టానంపై సొంత పార్టీ కార్యకర్తలే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కోడెలని అభిమానించే టి‌డి‌పి శ్రేణులు బాబుపై మండిపడుతున్నారు. పార్టీకి ఆవిర్భావం నుంచి సేవలు చేస్తున్న కోడెల కుటుంబాన్ని పక్కన పెట్టి పార్టీలు మారుతూ వచ్చిన కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు ఎలా ఇస్తారని ఫైర్ అవుతున్నారు.

అటు సీటు ఆశించి భంగపడ్డ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం సైతం టి‌డి‌పి అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. తమ కుటుంబంపై చంద్రబాబు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, తాము ఏ తప్పులు చేయలేదని,  చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని కోరారు.  టీడీపీ కోసం పని చేసి ప్రాణాలు వదిలిన కోడెల కుటుంబాన్ని పార్టీ పక్కన పెడుతోందని తన బాధ అని శివరాం ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబుకు కలిసే సమయం కూడా ఇవ్వడం లేదని చెబుతూనే..తాజాగా కార్యకర్తలతో చర్చించి..సత్తెనపల్లి బరిలో ఉంటానని ప్రకటించారు.

కోడెల కుటుంబం నుంచి పోరాడే హక్కు తమకు ఉందని చెప్పుకొచ్చారు. అయితే కోడెల వారసుడు ప్రకటనతో టి‌డి‌పికి షాక్ ఇచ్చినట్లు అయింది. కోడెల ఇండిపెడెంట్ గా పోటీచేస్తే టి‌డి‌పికి పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. అటు వైసీపీ నుంచి అంబటి రాంబాబు మళ్ళీ పోటీ చేసేలా ఉన్నారు..ఇటు టి‌డి‌పి నుంచి కన్నా పోటీ చేస్తారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. కానీ మధ్యలో కోడెల వారసుడు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి టి‌డి‌పి ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంది. మరి కోడెల వారసుడు పోటీ చేయకుండా టి‌డి‌పి అధిష్టానం బుజ్జగించి ఏదైనా పదవి ఇస్తుందా?లేక వేరే సీటు ఇస్తుందా? అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version