రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 క్లాజ్-1  వాడి జగన్ ని ఇరికించబోతున్న చంద్రబాబు ?

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదింప చేయడానికి శతవిధాల ప్రయత్నాలు చేసింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ రెండు బిల్లులు శాసనమండలిలో చంద్రబాబు తన చాణిక్య రాజకీయాన్ని ప్రదర్శించి అడ్డుకోవడం జరిగింది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు కావడంతో ఈ రెండు బిల్లులను తన విచక్షణ అధికారంతో సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది.

దీంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైసీపీ ఈ రెండు బిల్లులను తీసుకోవటంతో సెలెక్ట్ కమిటీ రెండు వారాల్లో సమావేశం కావాల్సి ఉండగా…సెలక్ట్ కమిటీ సమావేశం కాకపోవడంతో ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయని ఇటీవల వైసిపి పార్టీ నేతలు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టిడిపి మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బిల్లులు ఆమోదం పొందాయని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సెలెక్ట్ కమిటీ సమావేశం కాకపోతే ఆ రెండు బిల్లులు ఆమోదం పొందాయి అనటానికి అవి మనీ బిల్లులు కావని దీంతో అవి సభ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేశారు.

 

ఈ నేపథ్యంలో చంద్రబాబు రాజ్యాంగంలోని ఆర్టికల్ 189 క్లాజ్-1  వాడి జగన్ ని ఇరికించాలని కొత్త ఎత్తుగడ వేసినట్టు సమాచారం. మరోపక్క జగన్ ప్రభుత్వం ఈ విషయంలో వేచి చూసే ధోరణిలో వ్యవహరిస్తోంది. చంద్రబాబు నాయుడు మాత్రం లీగల్ గా ఈ రెండు బిల్లుల విషయంలో వైసిపి పార్టీని దెబ్బ కొట్టాలని గట్టిగానే ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version