కేవలం ఒకే ఒక్క సీటుతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల్లో ఉండే పార్టీ అని ఆయన తెలిపారు.
చంద్రబాబునాయుడు నెమ్మదిగా నోరు విప్పుతున్నారు. తన ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. తన ఓటమి గురించి పార్టీ నేతలలో చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన టీడీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. జగన్ గెలుపుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజలు టీడీపీని కోపంతో ఓడించలేదట. కేవలం సానుభూతి కారణంగానే వైఎస్సార్సీపీ గెలిచిందట. అందుకే.. పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవ్వరూ అధైర్య పడవద్దని చంద్రబాబు తెలిపారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఇందులోకి లాగారు చంద్రబాబు. కేవలం ఒకే ఒక్క సీటుతో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రెండుసార్లు అధికారంలోకి వచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎప్పుడూ ప్రజల్లో ఉండే పార్టీ అని ఆయన తెలిపారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే టీడీపీ కచ్చితంగా పుంజుకుంటుందని చంద్రబాబు.. టీడీపీ నేతలకు భరోసా కల్పించారు.
నేను ఎప్పుడూ పార్టీ ఎమ్మెల్యేలు, శ్రేణులకు అండగా ఉంటా. టీడీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిద్దాం. పార్టీకి దూరమైన వర్గాలను మళ్లీ దగ్గర చేసుకుందాం.. ఆ ప్రయత్నాలన్నీ తొందరలోనే మొదలుపెడదాం.. అని చంద్రబాబు పార్టీ నాయకులకు దైర్యం చెప్పారు.