“నిరపరాధులు” మాటపై బాబు నిలబడతారా?

-

కాకిపిల్ల కాకికి ముద్దు.. కాదనేవారేవరు? కాని ఆ కాకి పిల్ల వచ్చి కోడిపిల్లలకని వేసిన మేతను దూర్జన్యంగా తినేసుంటే మాత్రం ఆ కోడీ ఊరుకోదు, యజమాని ఊరుకోడు! ఆ సంగతి అలా ఉంటే… అవినీతి కేసుల్లోనూ, అక్రమాల కేసుల్లోనూ, దౌర్జన్యాల కేసుల్లోనూ వరుసగా టీడీపీ అరెస్టవుతున్న సంగతి తెలిసిందే. నిప్పు లేకుండా పొగరాదు అనే మాట సంగతి కాసేపు పక్కన పెడితే.. ఏసీబీ అధికారులు కేసులను విచారణ చేసి, ఆరోపణల్లో వాస్తవాలు ఉంటే సదరు నేతలను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు.

ఇంకొంతమంది అక్రమాలు చేసినట్లు దాదాపు అధికారులకు క్లారిటీ వచ్చిన తర్వాత, ఇప్పటికే ఆ అక్రమాలకు సంబందించి అనేక కేసులు నమోదైన తర్వాత.. ఇప్పటికే తొండ ముదిరి ఊసరవెళ్లి అయిపోయిన తరుణంలో అధికారులు అరెస్టు చేశారు. మహిళా కమిషనర్ పై ఒళ్లు తెలియని మాటలు మాట్లాడినందుకు మరొకరిపై కేసు నమోదు చేశారు. ఇలా ప్రతీ అరెస్టుకూ ఒక బలమైన, ప్రజామోదమైన, రాజ్యాంగబద్దమైన కారణం ఉందనేది వైకాపా నేతలు చెబుతున్నమాట! ఈ క్రమంలో… వీటన్నింటినీ అక్రమ అరెస్టులు అంటూ బాబు గొంతు చించుకుంటున్నారు. ఈ క్రమంలో… మరో అడుగు ముందుకేశారు!

నేరస్థులు పాలకులైతే నిరపరాధులు జైలుకే అనే మాట ఏపీలో అక్షర సత్యం అయ్యిందని చంద్రబాబు మాట్లాడుతున్నారు. జగన్ నేరస్థుడా.. ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొన్న వ్యక్తా.. రాజకీయ కక్షసాధింపులకు బలైన మనిషా అనేది బాబుకీ తెలుసు ప్రజలందరికీ తెలుసు! ఇవే మాటలు 2014 తర్వాత అధికారంలోకి వచ్చినప్పటినుంచి బాబు చెబుతూనే వచ్చారు.. 2019 ఎన్నికల సమయంలో మరీ ఎక్కువగా చెప్పారు… ఫలితం వారికి 151, వీరికి 23!!

ఈ క్రమంలో… నిన్నమొన్నటి వరకూ ఏపీలో జరుగుతున్న అరెస్టులను కక్షపూరిత చర్యలుగా, రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించిన బాబు… ఈసారి మరోకడుగు ముందుకువేసి… వారందరినీ నిరపరాధులుగా ప్రకటించే కార్యక్రమానికి తెరలేపారు! జగన్ ను నేరస్థుడిగా చెబుతూ… అవినీతి – అక్రమాల కేసుల్లో అరెస్టయిన టీడీపీ నేతలంతా నిరపరాధులు అన్నట్లుగా కొటేషన్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఒకరోజు అటో ఇటో వారిపై మోపబడిన అభియోగాలన్నీ కోర్టు విచారించి.. అనంతరం వారికి శిక్షలు వేస్తే… బాబు, ఏసీబీ అధికారులకు, ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతారా అని వైకాపా నేతలు ప్రశ్నిస్తున్నారు.

నిజంగా వారంతా నిరపరాధులు అయితే… బాబు స్టేట్ మెంట్స్ ఎందుకు? వారే స్వచ్చంగా బయటకు వస్తారు, అప్పుడు ప్రజలే తెలుసుకుంటారు ఎవరు నిరపరాధులు అనేది! ఈలోపు తొందరపడి స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తే… తర్వాత ఫలితం అటో ఇటో అయితే అభాసుపాలవుతారన్న విషయం బాబు మరిచిపోకూడదని పలువురు సూచిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version