ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని ఈ మధ్యకాలంలో వార్తలు ఎక్కువగా వినబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహంగా ఉన్న ఆయన కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారని ఈ మధ్యకాలంలో వార్తలు వినపడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం ఏంటో తెలియదు.
అయితే త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆస్తి పంపకాల విషయంలో తెలంగాణ కీలకంగా వ్యవహరించారని అలాగే రాష్ట్రానికి రావాల్సిన కొన్ని కొన్ని బకాయిల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపించాలని ముఖ్యమంత్రి జగన్ కోరే అవకాశాలు కనబడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు కాస్త ఆందోళన కరంగా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి లేని పరిస్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సీఎం కేసీఆర్ తో భేటీ అవడానికి సిద్ధమవుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం మా వల్ల కాదు అని స్పష్టంగా చెప్పడంతో ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.