అసలు జాతీయ పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మధ్య ఏకాభిప్రాయం ఉందా…? ఇప్పుడు ఈ ప్రశ్నకు బిజెపి నేతలు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మోడీ వద్దని చెప్తున్నా అమిత్ షా మాత్రం ఎక్కడా ఆగడం లేదని అంటున్నారు. ఎలా అయినా సరే అమలు చెయ్యాలని అమిత్ భావిస్తున్నారని, మోడీ మాత్రం అసలు ఈ విషయంలో ఏ మాత్రం అంగీకరించడం లేదని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
ఇటీవల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రాలు అన్నీ దీనిపై సీరియస్ గా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాలు సైతం ఈ విషయంలో ఆగ్రహంగానే ఉన్నాయి. కాకపోతే మోడీ అమిత్ షా మీద ఉన్న భయంతో ఎవరూ బయటపడటం లేదు. రాజకీయంగా బిజెపి బలంగా ఉంది అనడం కంటే మోడీ అమిత్ షా బలంగా ఉన్నారు అనడం నూటికి నూరు శాతం నిజం.
మోడీకి 2024 తర్వాత 75 ఏళ్ళు నిండిపోతాయి. వచ్చే ఎన్నికలకు ఆయన ప్రధాని అభ్యర్ధిగా ఉండే అవకాశం లేదు. ఇక అమిత్ షా విషయానికి వస్తే ఆయన ఇప్పుడు 60 ఏళ్ళ వయసులో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల నాటికి ప్రధాని అయ్యే అవకాశ౦ ఉంది. ఈ నేపధ్యంలోనే హిందు ఓటు బ్యాంకు ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అమిత్ షా. అందుకే వీలైనంత త్వరగా బిల్లులను ఆమోదించే కార్యక్రమాలు చేస్తున్నారు.
రాజకీయంగా కూడా ఎదురు లేదు కాబట్టి అమిత్ షా వెనక్కు తగ్గడం లేదు. ఇక బిజెపి అధక్ష్య బాధ్యతలను జెపి నడ్డాకు అప్పగించారు. అయితే ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం వద్దని, అమలు చేస్తే కచ్చితంగా అందరి దృష్టిలో విలన్లు అవుతామని మోడీ అమిత్ షా ను వారిస్తున్నట్టు సమాచారం. అయినా సరే మాత్రం వెనక్కు తగ్గడం లేదని, అమలు చేయడానికే చూస్తున్నారని చూస్తున్నారని అంటున్నారు.