పాపం సమంత.. ఎందుకు వెనకబడిపోతుంది..

-

టాలీవుడ్ లో సమంత స్టార్ స్టేటస్ ని అందుకుంది. గౌతం మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య తో కలిసి ఏం మాయ చేశావే సినిమాలో నటించి బోలెడన్ని లిప్ లాక్స్ ఇచ్చినప్పుడు అటు కోలీవుడ్ లో గాని ఇటు బాలీవుడ్ లో గాని ఎవరూ స్టార్‌ హీరోయిన్ అవుతుందని ఊహించలేదు. కానీ ఆ తర్వాత ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నితిన్, నాగార్జున, నాని, సూర్య, విజయ్ …ఇలా స్టార్ హీరోలందరి తోను నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. అయితే నాగ చైతన్యని పెళ్ళి చేసుకున్నాక మాత్రం కంప్లీట్ గా గ్లామర్ రోల్స్ కి దూరమై పోయింది. అలాంటి క్యారెక్టర్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేసింది. అయితే అక్కడి నుంచే సమంత ఎక్స్‌పరిమెంట్స్ చేయడం మొదలు పెట్టింది. కానీ అవి అంతగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తుంది. ‘యూ టర్న్’ రివ్యూలు బాగా వచ్చినా కలెక్షన్స్ పరంగా సినిమా చాలా బ్యాడ్ అని ప్రూవ్ అయింది.

ఇక ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఓ బేబీ కూడా సమంతకి అనుకున్నంత సక్సస్ ని ఇవ్వలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా కంటే ముందు వచ్చిన మజిలీ మంచి సక్సస్ ని అందుకుంది. భర్త నాగ చైతన్య తో కలిసి నటించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా హిట్ అవడం తోనే సమంత ఓ బేబి సినిమాకి కమిటయింది. అది యావరేజ్ గా నిలిచింది.

తాజాగా జాను అనే రీమేక్ సినిమాలో నటించిన సమంత నటిగా ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ ఈ సినిమా సమంత ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో చేరింది. జాను మార్నింగ్ షో టాక్ విని హిట్ అని హ్యాపీగా ఫీలయిన సామ్ ఫైనల్ గా రిజల్ట్ చూసి షాక్ కి గురైంది. దీంతో అసలు ఎందుకు నా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయని బాగా ఆలోచిస్తుందట. ఇకపై చేసే సినిమాలు ఎలాంటివి చేస్తే మళ్ళీ గట్టి హిట్ దక్కించుకుంటాను అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి సమంత నెక్స్ట్ ఎలాంటి సినిమాకి సైన్ చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version