పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్.. చేనేత కుటుంబాలకు వరాల జల్లు కురిపించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభించారు. మగ్గం ఉన్న ప్రతీ నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ.25వేల రూపాయలు అందిస్తామన్నారు. ఈ పథకం నేతన్నలు కుటుంబాలు గౌరవంగా బతికేందుకు ఉపయోగపడతాయన్నారు. అకౌంట్లలో పడే డబ్బులు బకాయిలు కింద జమ చేసుకోకుండా బ్యాంకులకు ఆదేశాలిచ్చామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 81వేల చేనేత కుటుంబాలకు ఈ పథకం కింద నగదు పంపిణీ చేస్తున్నామన్నారు సీఎం. నేతన్నలకు ఓ చరిత్ర ఉందన్నారు. ధర్మవరం చేనేతలు గురించి ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాల్ని చూశానన్నారు. ధర్మవరం చేనేతలు గురించి ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. ధర్మవరం చేనేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు.