తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ కొలువుదీరింది. వరుసగా రెండో సారి గెలిచిన టీఆర్ఎస్ పార్టీ ఇదివరకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ముందుగా సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగా.. తర్వాత మహిళా సభ్యులు ప్రమాణం చేశారు. అనంతరం.. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ లో తెలిపిన అక్షరమాల ప్రకారం మిగితా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఎన్నిక రేపు ఉంటుంది. ఇవాళ నామినేషన్లు స్వీకరిస్తారు. స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీల నేతలకు ఇదివరకే ఫోన్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా స్పీకర్ ఎన్నికకు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. దీంతో స్పీకర్ ఎన్నిక లాంఛనం కానుంది.
శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
Hon’ble CM Sri KCR taking oath as MLA in Telangana Assembly. pic.twitter.com/dCq2fDok87
— TRS Party (@trspartyonline) January 17, 2019