తెలంగాణలో ఉప ఎన్నికలు..? సీఎం రేవంత్ రెడ్డి మదిలో ఏముంది..?

-

తెలంగాణాలో ఉప ఎన్నికలు రానున్నాయా..? హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆ ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడుందా..? సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి..? బీఆర్ఎస్ వేసిన పాచికలు సక్సెస్ అవుతున్నాయా..? వీటి కేంద్రంగానే ప్రస్తుతం తెలంగాణా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.. పార్టీ మారిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద అనర్హత వేటు వెయ్యాలని దాఖలైన పిటిషన్ పై న్యాయస్థానం విచారించి.. తీర్పు రిజర్వ్ లో ఉంచింది..

ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు సుమారు 10 ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. వీరిలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి అనర్హత వేటు విషయంలో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ పూర్తయింది.. తీర్పు రిజర్వ్ లో ఉంది.. మిగిలిన మరో ఏడుగురు ఎమ్మెల్యేల అంశం మరి కొద్దిరోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది..

పక్క రాష్టాల్లో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న రేవంత్ రెడ్డి.. పార్టీ మారిన వారిచేత రాజీనామాలు చేయించి.. ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గతంలో మణిపూర్ లో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం ఆలస్యం కావడంతో కోర్టు వారిని అనర్హులుగా తీర్పునిచ్చింది. అది తెలంగాణాలో రిపీట్ కాకూడదని భావిస్తున్న సీఎం రేవంత్.. ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని ఆయన భావిస్తున్నారట..

పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి.. ఎన్నికలు వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. అలా చేస్తే.. పార్టీకి క్రెడిబులిటీ కూడా వస్తుందని.. ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఉండే వ్యతిరేకత మరోసారి నిరూపించినట్లువుతుందని రేవంత్ ఆలోచనగా ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు.. ఈ విషయంపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version