రాత్రిళ్ళు ఇలా చేసారంటే.. చర్మం యవ్వనంగా, బిగుతుగా ఉంటుంది..!

-

ప్రతి ఒక్కరు కూడా అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అయితే చర్మం బాగుండాలంటే కొన్ని టిప్స్ ని ఫాలో అవ్వక తప్పదు. వయసు పెరిగే కొద్దీ అందం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే వయసు పెరిగినా చర్మం బిగుతుగా, యవ్వనంగా కనబడుతుంది. మరి ఇక మీ అందాన్ని మీరు ఎలా రెట్టింపు చేసుకోవచ్చనే దాని గురించి చూద్దాం. రాత్రి నిద్రపోవడానికి ముందు ముఖానికి కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోండి. కొబ్బరి నూనె చర్మానికి జీవాన్ని అందిస్తుంది. మేకప్ తో, పౌడర్ తో, ఫేస్ క్రీమ్ లతో ఉదయం నుంచి ముఖం ఉంటుంది అలాంటప్పుడు రాత్రి కొబ్బరి నూనె రాస్తే కాస్త మార్పు ఉంటుంది.

నార్మల్ స్కిన్ వాళ్ళు ముఖానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళు కొబ్బరి నూనె రాసి అరగంట తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే మంచిది. మీ చర్మం ముడతలు పోగొట్టడానికి అలోవెరా జెల్ కూడా సహాయం చేస్తుంది, అలోవెరా లోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని అందంగా మారుస్తుంది ముడతలను తొలగిస్తుంది. రాత్రి నిద్రపోవడానికి ముందు కొద్దిగా కలబంద గుజ్జు ముఖానికి రాసుకుని నిద్రపోతే సరిపోతుంది. ముఖాన్ని అందంగా ఉంచడానికి, చర్మంపై ఉండే గీతలను పోగొట్టడానికి రాత్రిపూట పచ్చిపాలతో చర్మాన్ని శుభ్రం చేసుకుంటే చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు.

చర్మంలోని మృత కణాలను తొలగించేందుకు పాలు సహాయం చేస్తాయి చర్మాన్ని క్లియర్ గా ఉంచుతాయి. చర్మంపై పెరుగుని ఫేస్ ప్యాక్ లాగ రాసుకుంటే కూడా చర్మం బాగుంటుంది. చర్మాన్ని అందంగా ఉంచుతుంది. రాత్రి నిద్రపోవడానికి ముందు పెరుగును ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం చాలా చక్కగా ఉంటుంది. పసుపులో క్రీం లేదా పెరుగు మిక్స్ చేసి ముఖానికి రాస్తే అద్భుతమైన ప్రయోజనాలని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version