జగన్ పై అవ్వా తాతలు పొగడ్తల వ‌ర్షం.. ఎందుకో తెలుసా..?

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కాస్త దూకుడుగా ముందుకు సాగుతూ ఎన్నో ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ఇలా అనేక ర‌కాల ప‌థ‌కాలు చేప‌ట్టారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అవ్వా తాతలు, ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖు వస్తే, తమకు రావాల్సిన పెన్షన్ కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఇక లేదని అంటూ, సీఎం జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటివరకూ తమకు సమీపంలోని గ్రామ పంచాయితీలు, పెన్షన్ పంపిణీ కేంద్రాలకు వెళ్లి పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులకు, నేటి నుంచి ఇంటివద్దే పెన్షన్ అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్ననే నిధులు విడుదల కాగా, వార్డు వాలంటీర్లు, ఈ ఉదయం 8 గంటల నుంచే తమ పనిని ప్రారంభించారు. తమ వార్డు పరిధిలోని వృద్ధుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. కొన్ని చోట్ల బయో మెట్రిక్ సమస్యలు తలెత్తుతున్నట్టు తెలుస్తోంది. వృద్ధుల వేలిముద్రలు సరిపోకపోవడంతో, వారికి రేపు ఇస్తామని చెబుతున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version