నెక్స్ట్ బరిలో దిగేది అక్కడే అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి…వాళ్ళు వద్దంటున్నారుగా!

-

తెలంగాణ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అంటే హుజూర్‌నగర్ నుంచే బరిలో ఉంటానని ఉత్తమ్ స్ట్రాంగ్‌గానే చెప్పేస్తున్నారు. అయితే కోదాడ కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఉత్తమ్, ఇక్కడ నుంచే పోటీ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. నెక్స్ట్ ఉత్తమ్ కోదాడలోనే పోటీ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

కానీ దీనిపై స్పందించిన ఉత్తమ్, తాను హుజూర్‌నగర్ నుంచే బరిలో ఉంటానని చెప్పారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్‌నగర్ నుంచే పోటీ చేసి గెలిచారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌కు ఉపఎన్నిక వచ్చింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది.

అయితే నెక్స్ట్ ఎలాగైనా హుజూర్‌నగర్‌లో గెలవాలని ఉత్తమ్ చూస్తున్నారు. అందుకే మళ్ళీ అక్కడ నుంచే బరిలో ఉంటానని చెబుతున్నారు. కానీ కోదాడ కార్యకర్తలు మాత్రం ఇక్కడే బరిలో ఉండాలని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.

ఇక నెక్స్ట్ ఎన్నికల్లో ఉత్తమ్ కుటుంబానికి రెండు టికెట్లు వస్తాయా? రావనే అంశంపై క్లారిటీ లేదు. అయినా సరే ఉత్తమ్ అయితేనే కోదాడలో కాంగ్రెస్ గెలుస్తుందని కార్యకర్తలు చెబుతున్నారు. కానీ ఉత్తమ్ మాత్రం కోదాడపై పెద్దగా ఆసక్తిగా లేరని, హుజూర్‌నగర్‌లోనే పోటీ చేస్తారనేది ఫిక్స్ అయిపోయింది. అందుకే అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి టార్గెట్‌గా ఉత్తమ్ విమర్శలు చేస్తున్నారు. అవినీతి, అక్రమ సంపాదనలో సైదిరెడ్డి అగ్రస్థానంలో ఉన్నారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version