రెండు వర్గాలుగా చీలిన కాంగ్రెస్ పార్టీ….రేపు మరోసారి జీ 23 నేతల సమావేశం

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెట్టాయి. 5 రాష్ట్రాల్లో ఏ ఒక్కచోట అధికారంలోకి రాకపోగా… దారుణంగా ఓటమి పాలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలినట్లు కనిపిస్తోంది. సోనియా నాయకత్వాన్ని సమర్థించే గ్రూప్ ఓ వైపు… పార్టీలో సమూలంగా ప్రక్షాళన చేయాలనే సీనియర్ నేతల గ్రూప్ ఆఫ్ 23 మరోవైపు ఇలా రెండు గ్రూపులుగా విడిపోయారు. రేపు మరోసారి జీ 23 గ్రూప్ సమావేశం కావాలని నిర్ణయించింది. ఆదివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా ఏం తేల్చలేదు.. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉండాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. 

బుధవారం రోజు ఢిల్లీలో కాంగ్రెస్ రెబల్స్ గా పేరుపొందిన జీ23 గ్రూప్ నాయకులు సమావేశం కానున్నారు. గులాంనబీ ఆజాద్, శశిధరూర్, ఆనంద్ శర్మ, కపిల్ సిబల్ వంటి నేతలు ఈ మీటింగ్ రానున్నారు. జీ 23 లో ఉన్న నేతలే కాకుండా మరికొంతమంది నేతలు సమావేశానికి రానున్నారు. కాంగ్రెస్ లో అంతర్గత సంస్కరణలు అవసరం అని జీ 23నేతలు 2020లోనే సోనియాగాంధీకి లేఖ రాశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకత్వం నుంచి గాంధీలు తప్పుకుని ఇతరులకు నాయకత్వ పగ్గాలు ఇవ్వాలని.. తాను అందరి కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారని.. మరికొంత మంది ఒక ఇంటి కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారని సీనియర్ నేత కపిల్ సిబల్ కామెంట్స్ చేశారు. దీనికి ప్రతిగా ఎంపీ మానిక్కం ఠాగూర్… కాంగ్రెస్ ను చంపేసి, ఇండియా అనే ఐడియాను ధ్వంసం చేసేందుకే కాంగ్రెస్ నుంచి గాంధీ కుటుంబం వైదొలగాలని అంటున్నారని… బీజేపీ ఆర్ఎస్ఎస్ భాష మాట్లాడారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version