తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలోకి ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు?

-

తెలంగాణలో కాంగ్రెస్‌కు తాకుతున్న దెబ్బలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడిప్పుడే కాస్త కొలుకుంటుండగా… కాంగ్రెస్ ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు షాక్ ఇవ్వబోతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాని పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. నిజం చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం అయినట్టే లెక్క. ఇప్పటికే ఒకేసారి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో మూకుమ్మడిగా చేరారు. సీఎల్పీని కూడా టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేశారు. ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇంకేముంది ఒక జాతీయ పార్టీ అయి ఉండి.. తెలంగాణను 40 ఏళ్ల పాటు పాలించి ఇప్పుడు కనీసం ప్రతిపక్షహోదాను కూడా కోల్పోయిందంటే దాన్ని ఏమనాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే చెప్పాలి.

అయితే.. తెలంగాణలో దానికి తాకుతున్న దెబ్బలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడిప్పుడే కాస్త కొలుకుంటుండగా… కాంగ్రెస్ ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు షాక్ ఇవ్వబోతున్నారు. ఇద్దరు సీనియర్ నేతలు బలరాం నాయక్, సర్వే సత్యనారాయణ ఇద్దరు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కోమటిరెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నారని తెలుస్తుండగా.. వీళ్లతో పాటే.. ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు కూడా బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయి.

అయితే.. ఈ వార్తలను బలరాం నాయక్ ఖండించారు. నన్ను బీజేపీ నేతలు సంప్రదించిన మాట నిజమే. కానీ.. నేను పార్టీ మారడానికి సిద్ధంగా లేను. నా ప్రాణం ఉన్నంతవరకు నేను కాంగ్రెస్‌లోనే ఉంటా.. అని ఆయన తెలిపినప్పటికీ.. ఎవ్వరైనా ముందు ఇలాగే మాట్లాడుతారు.. ముందుగా వాళ్లే పార్టీ మారుతారు చూడు.. అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version