తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ ఫార్ములా కార్ రేస్.. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పట్టు..

-

ఈ ఫార్ములా కార్ రేస్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను ఊపేస్తోంది.. కేటీఆర్ అరెస్టు కాబోతున్నారంటూ.. కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న ప్రచారానికి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.. కేటీఆర్ అవినీతి అక్రమాలకు పాల్పడలేదని బదులిస్తూనే.. దీనిపై అసెంబ్లీలో చర్చించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.. చర్చకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ ను కోరారు..

ఈ ఫార్ములా కార్ రేస్ కేసు ఇప్పుడు రెండు పార్టీల మధ్య బిగ్ పైట్ కు దారి తీస్తోంది.. ఈ కేసులో కేటీఆర్ ను రేవంత్ సర్కార్ టార్గెట్ చేసింది. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత రెండు మూడు రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్కు వ్యతిరేకంగా లీకులు ఇస్తోంది.. కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించిందని నేతలు చెబుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ అంతా తానై వ్యవహరించారు. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ-కార్ రేసింగ్ తో రాష్టానికి 700 కోట్లు ఆదాయం వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. అయితే ఇందులో అవినీతి అక్రమాలు జరిగాయని.. కేటీఆర్ ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ గవర్నర్ కు లేఖ రాయడంతో.. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.. విచారణకు గవర్నర్ నుంచి ఆమోదం కూడా లభించిందని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ ను కలిసి అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరారు. లీకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని, తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని హరీశ్ రావు చెబుతున్నారు.. కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.. దమ్ముంటే చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version