క్యాడర్ కు దగ్గరవుతున్న కాంగ్రెస్.. గాంధీభవన్ కు మంత్రులు..

-

పార్టీ అధికారంలో ఉండటం ఎంత ముఖ్యమో.. పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.. అందుకు పీసీసీ ఛీప్ మహేష్ గౌడ్ చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అవుతున్నాయి.. సీనియర్లను కాదని.. అధిష్టానం మహేష్ గౌడ్ వైపు మొగ్గు చూపింది.. ఆయన హ్యాండిల్ చెయ్యలేరని అందరూ భావించారు.. కానీ మహేష్ గౌడ్ మాత్రం.. కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. పార్టీని క్యాడర్ కు దగ్గర చేస్తున్నారు.. దీంతో పార్టీ గాఢిలో పడినట్లే కనిపిస్తోంది..

అధికారంలో ఉన్న సమయంలో పార్టీ పటిష్టత గురించి ఆలోచించకపోతే ఏం జరుగుతుందో బిఆర్ఎస్ విషయంలో చూశాం.. ప్రతిపక్షంలోకి రాగానే.. పార్టీ చిన్నాభిన్నం అవుతుంది.. క్యాడర్ పోరాటాలు చేసేందుకు వెనకడుగు వేసే ప్రమాదం ఉంటుంది.. ఇవన్నీ అనుభవ పూర్వకంగా తెలసుకున్న కాంగ్రెస్.. అదికారంలో ఉన్నప్పుడే క్యాడర్ ను దగ్గరకు తీసుకోవాలని భావిస్తోంది.. అందుకోసం.. పీసీసీ ఛీప్ మహేష్‌ గౌడ్ తీసుకున్న నిర్ణయం సత్పలితాలను ఇస్తోందని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు..

ప్రతి వారం ఇద్దరు మంత్రులు గాంధీభ‌వ‌న్‌కు రావాలని సూచించారట.. దీంతో వారందరూ క్యాడర్ కు అందుబాటులో ఉండటం.. లోకల్ గా అవసరమైన పనులు జరుగుతూ ఉండటంతో క్యాడర్‌కు ప్రభుత్వం దగ్గరైందన్న ఫీలింగ్ కలుగుతోందట.. దీంతో చాలా మంది గాంధీభ‌వ‌న్ మెట్లెక్కి సమస్యలు చెప్పుకుంటున్నారు. పార్టీ ఆఫీస్‌కు వ‌చ్చేవారి విష‌యంలో కూడా మ‌హేశ్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ.. ప‌రిష్కార మార్గం చూపిస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.. జీవో 317తో ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల అంశం విష‌యంలో పీసీసీ చీఫ్ చొర‌వ తీసుకొని మంత్రుల‌ను గాంధీభ‌వ‌న్‌కు పిలిచి చ‌ర్చలు జరిపేలా చేశారట..

ప్రభుత్వానికి ఏ సమస్య వచ్చినా.. మహేష్ గౌడ్ చొరవ తీసుకుని.. వాటిని పరిష్కరించేందుకు చర్చలు జరుపుతున్నారు.. దాంతో పాటు.. ప్రతిపక్షాల విమర్శలను సైతం సమర్దవంతంగా తిప్పుకొడుతున్నారు.. సీనియర్లను నోప్పించకుండా.. వారికి ప్రాధాన్యత ఇస్తూ.. పార్టీలోని వారిని కూడా భాగస్వాములు చేస్తున్నారని.. గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్ గా మహేష్ గౌడ్ మారారన్న టాక్ వినిపిస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version