ప్రక్షాళన దిశగా తెలంగాణా కాంగ్రెస్.. అధ్యక్షుల మార్పు తప్పదా..?

-

అధికారం ఉన్నప్పుడే తెలంగాణాలో బలపడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.. దీని కోసం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.. ఇప్పటి వరకు ఉన్న జిల్లా అధ్యక్షులను మార్చాలనే ఆలోచనలో పీసీసీ అధ్యక్షులు ఉన్నట్లు పార్టీలో ఇంటర్నల్ గా చర్చ నడుస్తోంది.. మహేష్ గౌడ్ తన టీమ్ ను తయారుచేసుకుంటున్నారని గాంధీభవన్ వేదికగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది..

తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి మహేష్ గౌడ్ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.. ఇప్పటి వరకు ఉన్న జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మార్చబోతున్నట్లు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరైన టీమ్ ను తయారుచేసుకోవాలనే ఆలోచనలో మహేష్ గౌడ్ ఉన్నారట..ఈ క్రమంలోనే పనిచేసే వారికే పదవులన్న నినాదం తెలంగాణ కాంగ్రెస్ లో వినిపిస్తోంది..

ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో పార్టీ కోసం పనిచేసే వారికి మాత్రమే పీసీసీలో పదవులు వస్తాయంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు.. దీంతో ఆశావాహులు పదవులు కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.. ఇదే సమయంలో పీసీసీలో ఉండెదెవ్వరు..? బయటికి వెళ్లేదెవ్వరన్న చర్చ సాగుతోంది.. జిల్లా అధ్యక్షులను కూడా మార్చేస్తారనే టాక్ నడుస్తున్నా.. ఈ పదవి బాగా వ్యయంతో కూడుకున్నది కావడంతో ఉన్నవారినే కొనసాగించాలనే ఆలోచనలో కూడా పీసీసీ పెద్దలు ఉన్నారట..

జిల్లా అధ్యక్షులుగా ఉన్న కొందరు ఇప్పటికే ఎమ్మెల్యేలు అయ్యారు..మరికొందరు నామినెటెడ్ పదవులు పొందారు..దీంతో వారిని తొలిగించి కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్లో ఉండే ఇద్దరు అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డులను మార్చేస్తారని ఇందిరాభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.. వీరి స్తానంలో కొత్తవారికి ఛాన్స్ఇచ్చి.. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని పీసీసీ భావిస్తోందట.. కొద్దిరోజుల్లోనే మార్పులు చేర్పులు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షులు కసరత్తు చేస్తున్నారు..మొత్తంగా ఎవరు ఉంటారో.. ఎవరు ఊడుతారో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version