అయోమయంలో ఇండియా కూటమి.. కాంగ్రెస్ వైపే అందరి చూపు..

-

దేశంలోని పెద్ద రాష్టాల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆదిరిస్తున్నారు.. దీంతో ఇండియా కూటమిలో పార్టీల పూర్ ఫర్ఫమెన్స్ పై నేతలు అసంతృప్తిలో ఉన్నారు.. దీంతో కూటమిని లీడ్ చేసే అవకాశం మరొకరికి ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి..? రాహుల్ మీద ఎందుకంత వ్యతిరేకత..?

మహారాష్టలో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.. అంతకుముందు హర్యానా, జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయింది.. దేశంలోని పెద్ద రాష్టాల్లో ఎదురైన ఓటములు ఇండియా కూటమిని కలవరానికి గురి చేస్తున్నాయి.. పెద్దన్న పాత్ర పెద్దన్న పోషిస్తున్న కాంగ్రెస్ పనితీరుపై ఇతర పార్టీలో అసంతృప్తిలో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.. దీంతో ఇండియా కూటమిని లీడ్ చేసేదెవ్వరు అనే సందిగ్దత కూటమిలో నెలకొంది.

కాంగ్రెస్ తో పాటు 28 పార్టీలు కలిసి గతేడాది జులైలో ఇండియా కూటమి ఏర్పాటైంది. అయితే అప్పటి నుంచి సాలీడ్ విజయాలు కూటమికి రావడంలేదు.. అక్కడక్కడా కూటమి అధికారంలోకి వచ్చినా.. కాంగ్రెస్ పనితీరు ఘోరంగా ఉంటోంది.. దీంతో కాంగ్రెస్ పెద్దన పాత్రను ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయనే మాట వినిపిస్తోంది.. మహారాష్ట ఓటమి తర్వాత జరిగిన ఇండియా కూటమి సమావేశానికి తృణమూల్ డుమ్మా కొట్టడానికి ఇదే కారణమనే ప్రచారం జరుగుతోంది..

48 సీట్లకు దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఆరు ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీనే గెలవడంతో.. కూటమిని లీడ్ చేసే ఛాన్స్ మమతాకు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.. దేశంలో బలంగా ఉన్న బిజేపీని ఎదుర్కొవడంలో కాంగ్రెస్ విఫలమైందన్న విమర్శలు పెరుగుతున్నాయి.. ఇతర పార్టీల అభిప్రాయాలను రాహుల్ గాంధీ పరిగణలోకి తీసుకోరని.. సమిష్టి నిర్ణయాలను అమలు చెయ్యకపోవడం వల్లే ప్రత్యర్ది పార్టీలకు కలిసొస్తుందని కూటమిలోని కొన్ని పార్టీలు చెబుతున్నాయి.. బిజేపీ ఎదుర్కొవాలంటే గట్టి నాయకులు ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కూటమిలో ఏదైనా జరగొచ్చనే చర్చ మొదలైంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version