కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్ .. ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

-

పదేళ్ల పాటు అధికారాన్ని చెలాయించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమైంది.. దీంతో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు కాంగ్రెస్ పార్టీపై పోరాటాలు చేస్తోంది.. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవ్వడంతో ఆ బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌ రావులు తీసుకున్నారు.. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతున్నారు.. దీంతో హస్తం పార్టీ వారికి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఆయనకి చెక్ పెట్టేందుకు బలమైన నేత కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తోంది.. లోకల్ గా కేటీఆర్ ప్రభావాన్ని తగ్గించి.. పార్టీని బలోపేతం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.. అందులో భాగంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను సిరిసిల్లలో పర్యటించాలని అధిష్టానం ఆదేశించిందట..అయినా పార్టీకి మైలేజ్ రాకపోవడంతో.. మరో ప్లాన్ వేసినట్లు పార్టీలో చర్చ నడుస్తోంది..

గత ఎన్నికల్లో కేటీఆర్ పై పోటీ చేసి ఓటమి పాలైన.. కేకే మహేందర్ రెడ్డిని పార్టీ దగ్గరకు తీసుకుంటుందట.. ఎమ్మెల్యే స్థాయి ప్రోటోకాల్ కల్పించి.. ఆయన్ని నియోకవర్గంలో తిప్పాలని పార్టీ భావిస్తోందట..అందులో భాగంగా మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సైతం సీఎం రేవంత్ రెడ్డి మొగ్గుచూపుతున్నారని.. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యనేతలకు ఈ విషయాన్ని తెలియజేశారని తెలుస్తోంది.. మహేందర్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టుంది.. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు కూడా.. గత ఎన్నికల్లో కేటీఆర్ ను ఢీకొట్టి.. తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు.. ఈ క్రమంలో ఆయనకు ప్రోటోకాల్ కల్పించి.. కేటీఆర్ కు ధీటుగా తయారుచెయ్యాలని పార్టీ భావిస్తోందని పార్టీలో టాక్ నడుస్తోంది..

నిత్యం కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తున్న కేటీఆర్ కు… లోకల్ గా చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. నియోకవర్గ స్థాయిలోనే తనను ఎదుర్కొంటే.. కొంత మేర అతని దూకుడును తగ్గించొచ్చని పార్టీ ఆలోచనగా ఉంది.. దీన్ని పసిగట్టిన కేటీఆర్.. ఇటీవల ఎక్కువ రోజులు నియోకవర్గంలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట.. మొత్తానికి కేటీఆర్ కు చెక్ పెట్టాలని పావులు కదుపుతున్న కాంగ్రెస్ కు.. అది సక్సెస్ అవుతుందో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version