తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు : మంత్రి ఆనం

-

తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఏపీ దేవాదాయ శాఖ  మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తాజాగా మీడియాతో మాట్లాడారు.  శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ పై సిట్ నిజానిజాల నిగ్గు తేలుస్తుందని వెల్లడించారు. విజిలెన్స్, సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులను శిక్షిస్తామని పేర్కొన్నారు.  తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలను జరగనివ్వమని తెలిపారు.

ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితో లడ్డూ, అన్న ప్రసాదాలను తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేస్తుందని వెల్లడించారు. శ్రీ వారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరగాలని ఆ స్వామి వారిని ప్రార్థించినట్టు తెలిపారు. అక్టోబర్ 04న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే బక్తులకు తిరుమల దేవస్థానం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర, కన్యకా పరమేశ్వరి పండుగలను రాష్ట్ర పండుగల జాబితా చేర్చామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలోనే పాలక మండలి ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version