ఆంద్రప్రదేశ్ రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి.. ఎత్తులు, ఎత్తులకు పై ఎత్తులు.. అసలైన రాజకీయం చూస్తున్నాం మనం.. మొన్నటి తెలంగాణ ఎలక్షన్స్‌లో ఏమైంది.. టీఆర్ఎస్ గుర్తును పోలిన ట్రక్కు వల్ల ఆ పార్టీ ఓడిపోవడం మనం చూశాం.. ఒక్క గుర్తుకే అలాంటి ఫలితం వస్తే.. మరి అభ్యర్థుల పేర్లు,, పార్టీ కలర్లు,, గుర్తులు ఒకేలా ఉంటే.. అహ ఉండేలా ప్లాన్ చేస్తే.. ఆఆఆఆ అదే జరిగినట్లు స్పష్టంగా కన్పింస్తుంది..
ఒకప్పటి మత ప్రచారకుడు.. లేటెస్ట్ కమేడియన్ పాల్ పార్టీ పేరు తెలుసా మీకు.. ఓహ్ అదొకటుందా అనకండి.. ఉంది.. దాని పేరు ప్రజాశాంతి పార్టీ.. మనోడు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు.. అయితే మనోడు వైఎస్సార్సీపీని ఓడిస్తానంటూ ప్రచారం చేస్తున్నాడు.. మొన్నటి వరకు ఎవరూ నమ్మలేదు కానీ ఇప్పుడు నామినేషన్లు వేసిన తరువాత నమ్మాల్సి వస్తుంది..
ఎందుకంటే..
వైసీపీ గుర్తు.. ప్రజాశాంతి పార్టీ గుర్తు ఒకేలా ఉండటం.. అంతేనా.. కొన్ని నియోజక వర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం.. ఆ కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న కారణాలు.. అవును ఈ కారణాల వల్ల కూడా ఓటర్లు తికమక అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంది.. అయితే ఆ ఓట్ల వల్ల ప్రజాశాంతి పార్టీకి ఎలాంటి లాభం కలిగించకపోయినా.. వైఎస్సాఆర్సీపీకి మాత్రం నష్టం కల్గిస్తాయి.మరి ఈ కవలల ప్లాన్ పాల్ చేశాడా.?? మేం నమ్మం అంటారా..? మనోడికి ఇన్ని తెలివితేటలు లేవంటారా.. మరి ఇంత పెద్ద స్కెచ్ ఎవరేసుంటారంటారు..? రాజకీయంలో సీనియర్.. అవినీతిలో సీనియర్, మోడి కంటే తోపు.. ఆఆఆ ఆయనదే ఈ స్కెచ్..
మీకు నిజంగా జగన్‌కే ఓటేద్దమనుకుంటే… జగన్‌కే ఓటు వేయండి.. పాల్కి వేద్దామనుకుంటే పాల్కే వెయ్యండి.. తికమక పడొద్దు.. జగన్‌పై జరుగుతున్న ఈ కుట్రను ఛేధించాలనుకుంటే.. ఈ వార్తను అందరికి తెలిసేలా షేర్ చేయండి..
-Rk