బాబుగారి మ‌రో అవినీతి బాగోతం….ఎట్ట‌కేల‌కు కొలిక్కి

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడి అవినీతి చిట్టా విప్పితే ఆ కంపు భ‌రించ‌డం ఎవ‌రివ‌ల్లా కాదు అనేది న‌గ్న‌స‌త్యం.ఒక‌టి కాదు రెండు కాదు అనేక విధాలుగా త‌ప్పులు చేసి త‌ప్పించుకుని తిర‌గ‌డం బాబుకే చెల్లింది.తన అనుచ‌ర‌వ‌ర్గానికి లాభం చేకూర్చ‌డానికి చంద్ర‌బాబు ఎంత‌లా తాప‌త్ర‌య‌ప‌డ‌తారో ప్ర‌భుత్వ ఆస్తుల‌ను అప్ప‌నంగా మాయం చేయ‌డానికి కూడా అంతే తొంద‌ర‌ప‌డ‌తార‌ని మ‌రోసారి రుజువైంది. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చేసిన మ‌రో అవినీతి కేసు 15 ఏళ్ళ త‌రువాత కొలిక్కి వ‌చ్చింది.50 వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాల భూములను ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చూసిన చంద్ర‌బాబు ప్ర‌య‌త్నానికి ఎట్ట‌కేల‌కు కోర్టు అడ్డుక‌ట్ట వేసింది.గుర్తింపు లేని కంపెనీకి దారాద‌త్తం చేయాల‌ని చూసిన 800 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదేన‌ని తీర్పు వ‌చ్చింది. దీంతో ఆ భూమి ఇప్పుడు ప్ర‌భుత్వ ఖాతాలోకి వెళ్ళిపోనుంది.

2003లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ‘ఐఎంజీ భారత్‌’కు ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించారు.ఐఎంజీ భారత్‌ అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా దానికి అహోబలరావు అలియాస్ బిల్లీరావు అధినేతగా ఉన్నారు.క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది ఆ కంపెనీ.ఆ త‌రువాత 2004లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యారు.ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ సర్కారు అనాడు ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌గా హైకోర్టు కూడా వాటిని స‌మ‌ర్ధించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను ఈ ఫేక్ కంపెనీకి కేటాయించింది చంద్ర‌బాబు స‌ర్కారు.ఆ సమయంలో అక్కడ ఎకరం ధ‌ర సుమారు రూ. 10 కోట్లు పలుకుతుండగా ఎకరం రూ.50 వేల వంతున ఆ కంపెనీకి కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న ఉత్తర్వులు జారీచేశారు.ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం కూలిపోయి 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఐఏంజీకి కేటాయించిన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది.ఎలాంటి అనుభవం లేని సంస్థకు ఎలా అప్పగిస్తారంటూ చంద్రబాబు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.అయితే భూ కేటాయింపు రద్దును సవాల్ చేస్తూ సదరు ఐఎంజీ భారత్ సంస్థ‌ హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు స్టేటస్-కో లో ఉండిపోయింది. సుదీర్ఘ వాదోపవాదాల తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పుడు ఆ భూములు సర్కారువే అని హై కోర్టు స్పష్టం చేసింది. 2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ఇప్పుడు ప్రభుత్వం ప‌రిధిలోకి వ‌చ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version