ఏపీ ప‌ర్య‌ట‌న లో సీపీఐ నేత నారాయ‌ణ కు తీవ్ర‌ గాయాలు

ఎప్పుడు కేంద్రం తో పాటు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల పై విరుచుకు ప‌డే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కి తీవ్ర గాయం అయింది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం లో ఇటీవ‌ల భారీ వ‌ర్షా ల తో చిత్తురు జిల్లా రాయ‌ల చెరువు లీకేజీ అయింది. దీంతో చాలా ప్రాంతాలు ముంపున‌కు గురి అయ్యాయి. దీంతో సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ ముంపు గ్రామాలు అయిన రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు ల‌లో ప‌ర్యటించారు.

అయితే అక్కడి నుంచి దాదాపు కిలోమీటరు మేర నడుచుకుంటూ వెళ్లి రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. అక్క‌డి నుంచి వ‌చ్చే స‌మ‌యంలో నారాయణ కుడి కాలు కు గాయం అయింది. అదే సమయంలో చెరువు కట్ట ను పరిశీలించేందుకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వ‌చ్చారు. అక్కడే కూర్చుని ఉన్న సీపీఐ నేత‌ నారాయణను చూసి పలకరించారు. కాలు కి గాయం అయిన చోట తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ఫిజియోథెరపీ చేశారు. అనంత‌రం చికిత్సకోసం కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తన వాహనంలో ఆస్పత్రి కి వెళ్లారు.