కాంగ్రెస్ కు వరుస కౌంటర్లు ఇస్తున్న కామ్రేడ్స్. వారిద్దరి మధ్య ఎందుకు చెడింది.?

-

ఎన్నికల దాకా కలిసి మెలసి ప్రచారం చేసిన ఆ రెండు పార్టీలు.. ఇప్పుడు దూరమయ్యాయా..? బీఆర్ఎస్, బిజేపీ లక్ష్యంగా విమర్శలు చేసిన ఆ రెండు పార్టీలు.. కొన్ని విషయాల్లో ఎందుకు ఎడమొఖం. పెడమొఖంగా ఉన్నాయి.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికి కారణాలేంటి..? తెలంగాణా వామపక్ష నేతల వరుస కౌంటర్ల వెనుక ఉన్న బలమైన రీజనేంటో చూద్దామా..?

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన వామపక్షాలు.. ఇప్పుడు దూరమయ్యాయనే అనే ప్రచారం జోరందుకుంది.. అంశాల వారీగా కాంగ్రెస్‌కు వారు వరుస పెట్టి కౌంటర్లు ఇస్తున్నారు. హామీల అమలు నుంచి రుణమాఫీ దాకా… కౌంటర్లు ఇస్తూ వచ్చిన కామేండ్రులు.. కవిత బెయిల్ విషయంలో దూకుడు పెంచారు..దీంతో లెఫ్ట్‌ పార్టీలు,కాంగ్రెస్‌ మధ్య ఏదో జరుగుతోందన్న చర్చ కీలకంగా మారింది. ప్రభుత్వం ఏర్పడికొత్తలో సీపీఐ సభ్యులు కూనంనేని.. కాంగ్రెస్ కు అంశాలవారీగా మద్దతిచ్చారు.. ఇదే సమయంలో సీపీఎం, సీపీఐ కీలక నేతలు రేవంత్ రెడ్డిని కలిసి.. మద్దతు తెలిపారు..ఇంత వరకు భాగానే ఉన్నా… ఈ మధ్యే వామపక్ష పార్టీల తీరు. కామెంట్స్ పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారాయి..

రుణమాఫి విషయంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.. మిత్రపక్షంగా ఉన్న సీపీఐ కూడా బీఆర్ఎస్ బాటలోనే విమర్శలు చేస్తూ ఉండటం ఇప్పుడు పలు చర్చలకు దారితీస్తోంది.. దాంతో పాటు.. ఇటీవల ఖమ్మంలో మంత్రి తుమ్మలను సీపీఐ శ్రేణులు అడ్డుకోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.

ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి విషయంలో సీపీఐ స్పష్టత కోరుతోంది.. హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఊరుకోమని వామపక్షనేతల హెచ్చరికలతో కాంగ్రెస్ సర్కార్ కూడా అంతర్మథనంలో పడిందట.. భవిష్యత్లో వామపక్షనేతలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కినా ఆశ్చర్యపోనవసరంలేదనే టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.. మొత్తంగా ఆరెండు పార్టీల మధ్య ఉన్న బంధానికి బ్రేక్ పడిందనే చర్చ సాగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version