దేశ వ్యాప్తంగా స్పిరిచువల్ టూర్ చేస్తున్నాను. హైదరాబాద్ లో మూడు రోజులు ఉంటాను. ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి టూర్ చేస్తున్నాను అని రాబర్ట్ వాద్రా తెలిపారు. మతం.. రాజకీయం రెండు వేర్వేరు. కానీ దేశంలో అనేక సమస్యలను వదిలేసి మత రాజకీయాలను చేయాలని చూస్తున్నారు అన్నారు. అలాగే రాహుల్ ను టార్గెట్ చేస్తూ కంగనా చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాబర్ట్ వాద్రా. కంగనాకు ఏం తెలియదు.. ఆమె ఇష్టం వచ్చింది మాట్లాడుతారు. రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ను విమర్శించడం తప్ప ఆమెకు ఏం తెలియదు. దేశానికి తొలి ప్రధాని ఎవరో కూడా ఆమెకు తెలియదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కంగనా ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.
దేశంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్ లో జరిగిన ఘోరాన్ని చూశాం.. మణిపూర్ లోను అల్లర్లు జరిగాయి. బెంగాల్ ఘటనలో పార్టీలు తమ వ్యక్తిగత ప్రయోజనాలను దూరం పెట్టాలి. బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. మహిళలపై దాడులను.. దారుణాలను చూస్తున్నాం. నాకు భార్య.. కూతురు ఉంది.. వాళ్లు కూడా బయటకి వెళ్తుంటారు.. ఏం జరుగుతుందో తెలియని భయం. ప్రియాంక గాంధీ పొలిటికల్ విజిట్స్ చేస్తుంది.. రాత్రుల్లోను పర్యటనలుంటాయి ఏం జరుగుతుందో భయపడాల్సి వస్తుంది. దేశంలో మహిళలపై దాడులను చూస్తుంటే భయం వేస్తుంది అని రాబర్ట్ వాద్రా తెలిపారు.