కేసీఆర్‌తో సీపీఎం దోస్తీ.. ప్ర‌కాశ్ క‌ర‌త్ కీల‌క వ్యాఖ్య‌లు

-

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తో దోస్తీ విష‌యంలో సీపీఎం ఆల్ ఇండియా నాయ‌కులు ప్ర‌కాశ్ క‌ర‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ప్ర‌కాశ్ క‌ర‌త్ రంగ‌రెడ్డి జిల్లా తుర్క యాంజ‌ల్ కు వ‌చ్చాడు. ఇక్క‌డ ప్ర‌కాశ్ క‌ర‌త్ మీడియాతో స‌మావేశం అయ్యారు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో బీజేపీని వ్య‌తిరేకించే విష‌యంలో మాత్ర‌మే తామ పార్టీ కేసీఆర్ కు మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని ప్ర‌కాశ్ క‌ర‌త్ స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటే.. మాత్రం త‌మ పార్టీ కేసీఆర్ పై కూడా పోరాటం చేస్తుంద‌ని తెలిపారు. అలాగే దేశంలో బీజేపీని ఓడించ‌డానికి ఏ పార్టీతోనైనా క‌లిసి ప‌ని చేయ‌డానికి సిద్దంగా ఉన్నామ‌ని తెలిపారు. అందులో భాగంగానే కేసీఆర్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నామ‌ని అన్నారు. అలాగే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు. అలాగే మిగితా రాష్ట్రాల‌లో కూడా బీజేపీని ఓడించ‌గ‌ల స‌త్త ఉన్న పార్టీకే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version