భారతీయ జనత పార్టీని దళిత సమాజం మద్దతు ఇవ్వదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ రోజు పెద్దపల్లిలో మీడియాతో మాట్లడిన మంత్రి కొప్పుల ఈశ్వర్.. బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలపై దృష్టి పెడతామని.. దళిత ప్రజా ప్రతినిధులు పై దృష్టి పెట్టారని విమర్శించారు. దళిత ప్రజా ప్రతినిధులును బీజేపీ నాయకులు విమర్శించేది తెలంగాణ సమాజం చూస్తుందని అన్నారు.
రాష్ట్రంలోని దళితులకు బీజేపీ నిజ స్వరూపం తెలుసునని అన్నారు. దళితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజీపీ మద్దతు ఇవ్వరని అన్నారు. బీజేపీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. దళితులపైనా భారత జనత పార్టీకి అంత ప్రేమ ఉంటే.. దేశం అంతా దళిత బంధు అమలు చేయాలని అని అన్నారు. కానీ దేశం అంత దళిత బంధు అమలు చేయాలని అధిష్టానాన్ని అడిగే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి లేదని అన్నారు. రాష్ట్రంలో దళితులు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని అన్నారు.