అది ఫేక్ ఆడియో కాదు… తేల్చేసిన డీప్ ఫేక్ ఎనాలిసిస్ సంస్థ… టీడీపీకి ఇబ్బందులే

-

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్య భువనేశ్వరి వాయిస్‌గా ఓ ఆడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే అది ఫేక్ ఆడియో అని టీడీపీ నేతలు కొట్టిపారేస్తూ దానిని కుట్రగా మార్చి వైసీపీకి అంటగట్టాలని చూసారు ఎల్లోమీడియా నేతలు. అయితే అది డీప్ ఫేక్ కాదని తేలిపోయింది. కేంద్రానికి చెందిన డీప్ ఫేక్ ఎనాలిసిస్ యూనిట్ దీనిని నిర్ధారించేసింది. అందులో ఉన్నది నిజమైన వాయిస్ అని తేల్చడంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల వేళ వరుస వివాదాలు చుట్టేస్తుండటంతో చంద్రబాబు సహా టీడీపీ కేడర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ ఆడియోలో ఎవరినో ఆమె అన‌రాని మాట‌లు అంటూ ఇంకా చెప్పాలంటే బూతులు తిడుతున్నట్టు ఉంది. ఇది దళితులను ఉద్దేశించిన‌ట్టు ఉన్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు,ద‌ళితులంటే నారా కుటుంబానికి గౌర‌వం లేద‌ని ఇప్పటికే పలు సందర్భాల్లో తేలిపోయింది. ఇప్పుడు ఈ ఆడియో ద్వారా అది స్పష్టమైంది. దళితులను బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే వాడుకోవడమే తప్ప వారిని ఉన్నత స్థానాలకు చేర్చాలనే ఆలోచన టీడీపీకి కానీ ఆ పార్టీలోని అగ్రవర్ణాల నేతలకు లేదని నిర్ధారణ అయిందని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.అక్క చెప్పినా తాను పట్టించుకోలేదని… వీళ్లంతా బతకనివ్వరని తీవ్ర అసహనంతో మండిప‌డుతున్న మాటలు నారా భువనేశ్వరి మాట్లాడినట్టు ఆ ఆడియో క్లిప్‌లో ఉన్నాయి. ఇప్ప‌టికైనా ద‌ళితులు,బ‌ల‌హీన వ‌ర్గాలు చంద్ర‌బాబు వైఖ‌రిని తెలుసుకోవాల‌ని వైసీపీ నేత‌లు సూచిస్తున్నారు.

ఈ ఆడియో బయటికి వచ్చాక అది ఫేక్ అని దబాయిస్తూ చంద్రబాబు సహా టీడీపీ నాయకులు ఖండించారు.పైగా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక భువనేశ్వరి అయితే ఏకంగా ట్విట్టర్లో వైసీపీని టార్గెట్ చేస్తూ సందేశం పంపింది.మహిళలను ఇంతలా అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు.వైసీపీలో మహిళలకు ప్రత్యేక భద్రత ఉంటుంది.సంక్షేమ పథకాలను కూడా మహిళలకే అందిస్తున్న ఘనత సీఎం జగన్ ప్రభుత్వానిది.అలాంటి జగనన్న పాలనపై బురద చల్లాలని చేసిన ప్రయత్నం విఫలమై టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని అన్నివర్గాలను జగనన్న మాదిరిగా సమానంగా చూడాలని వైసీపీ శ్రేణులు సూచిస్తున్నారు.అంతేకాదు సూర్యుడిపై ఉమ్మి వేస్తే మనపైనే పడుతుందన్న వాస్తవాన్ని ఇప్పటికైనా టీడీపీ గ్రహించాలని ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news