హస్తిన రాజకీయం..కేసీఆర్ కాన్సెప్ట్ ఏంటి?

-

చాలా రోజుల గ్యాప్ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు…గత ఫిబ్రవరిలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మూడు రోజులు ఉన్నారు. అయితే అప్పుడు పర్యటన తర్వాత కేసీఆర్…బీజేపీల మధ్య శతృత్వం బాగా పెరిగింది…బీజేపీ ఏమో కేసీఆర్ టార్గెట్ గా ఫైర్ అవుతుంటే…కేసీఆర్ ఏమో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. బీజేపీ వల్ల దేశం నాశనమైపోతుందని చెప్పి కేసీఆర్ రాజకీయం నడిపిస్తున్నారు.

అలాగే కేంద్రంలో బీజేపీకి వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ జట్టు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు..అదే సమయంలో జాతీయ స్థాయిలో పార్టీ పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి. ఇక తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ మద్ధతు ఇచ్చారు..కానీ ఎన్డీయే పక్షం తరుపున నిలబడిన ద్రౌపది ముర్ము విజయం సాధించి..రాష్ట్రపతి పీఠంలో కూర్చున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడం రాజకీయాలు హీటెక్కాయి. కేసీఆర్..ద్రౌపదిని కలిసి శుభాకాంక్షలు చెబుతారని తెలుస్తోంది.

అదే సమయంలో కేంద్రంలోని పెద్దలని కలిసి…రాష్ట్రానికి వరద సాయం చేయమని కోరతారా? లేక కేంద్రంలోని విపక్ష పార్టీల నేతలతో భేటీ అయ్యి…మోదీ సర్కార్ కు వ్యతిరేకమైన శక్తులని ఇంకా ఏకం చేసే కార్యక్రమాలు చేస్తారా? అనేది చూడాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మార్గరేట్ అల్వాను ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా విపక్షాలు ప్రకటించగా.. నామినేషన్ దాఖలు చేసారు. అయితే విపక్ష పార్టీలు వ్యూహాత్మకంగా దక్షిణాదికి చెందిన మహిళా అభ్యర్ధిని ఉప రాష్ట్రపతి రేసులో నిలబెట్టారు.

కాకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి కేసీఆర్ మద్ధతు ఇస్తారా లేదా? అనేది చూడాలి. ఇప్పటికే తమని సంప్రదించకుండా అభ్యర్ధిని ప్రకటించారు అని చెప్పి…తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ..ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అలాగే మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏ ఏ పార్టీ నేతలని కలుస్తారో…ఢిల్లీలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version