ఏపీ విధ్వంసమే చంద్రబాబు విజనా….

-

ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వలన అదే నిజమని నమ్మేస్తుంటారు అమాయక ప్రజలు. అలా ప్రజలను అమాయకులను చేసి వారిని తప్పుతోవ పట్టించడం చంద్రబాబుకి ఉండే గొప్ప టాలెంట్. తాను చెప్పేది గొప్ప అని నమ్మించి ప్రజలను ఎన్నిసార్లయినా మోసం చేసి ముంచగలను అనేది బాబుగారి విశ్వాసం. ఇక తన అతితెలివిని ప్రచారం చేసేందుకు తన మీడియా ఎలాగో చేతిలోనే ఉంది. వాటి ద్వారా ప్రజలను ఎన్నిసార్లయినా వెర్రివాళ్లను చేయగలను అనేది చంద్రబాబు ప్రగాఢ నమ్మకం. అందుకే తానేదో చాణిక్య లాంటి శాస్త్రవేత్తని అన్నట్లు తన దగ్గర విజన్ 2020,2030, 2047 ఉన్నాయని చెప్తున్నారు. అధికారంలో లేనప్పుడు ఇలా విజన్ జపం చేయడం అధికారం చేపట్టాక తన అనుయాయులకు,కుటుంబ సభ్యులకు దోచిపెట్టడం…ఇదే ఆయన దగ్గర ఉండి గొప్ప విజన్. చేసేవన్నీ వ్యవస్థలను ముంచేసే పనులు.. తీసుకునేవన్నీ గుడ్డి నిర్ణయాలు. కానీ ఇప్పుడు మళ్ళీ విజన్ 2047 అంటూ ప్రజలముందుకు వస్తున్నారు.

పరిశ్రమల రాకతో నిరుద్యోగ సమస్య తీరుతుందనే చంద్రబాబు చేతల్లో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. తనను సీఈవోగా ఊహించుకుంటూ గతంలో రాష్ట్రంలో దాదాపు 54 పరిశ్రమలను అమ్మేశారు.పైగా ఆ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని అంటూ తన భజన మీడియా సంస్థల ద్వారా ప్రజలను నమ్మించారు. నిజమే నష్టాల్లో ఉన్న పరిశ్రమలను మూయించడమే మంచిది అనేలా ప్రజాలతోనే చెప్పిస్తారు.ఆ సంస్థలను అమ్మేది కూడా తన అనుచరులకే అనే వాస్తవాన్ని ప్రజలు తెలుసుకోలేరు అనేది చంద్రబాబు నమ్మకం. ఈ విధంగా ఉమ్మడి ఏపీలో 54 సంస్ధలను అమ్మేశారు. తనకు ఎదురు తిరిగితే ఎవరినైనా లెక్క చేయరు అనేందుకు ఉదాహరణ బషీర్బగ్ సంఘటన. విద్యుత్ చార్జీలు పెంచగా ఇదేంటని ప్రశ్నించిన రైతులను తుపాకీ గుళ్ళకి బలిచేసిన ఘనత ఈ చంద్రబాబుది అని ప్రజలు ఇప్పటికీ తిట్టుకుంటూ ఉంటారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎదో తన జేబులోంచి డబ్బులు లాక్కుంటున్నారనే అభిప్రాయo ఉన్న చంద్రబాబు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు ? అని ప్రశ్నించిన సందర్భాలు అనేకం.వాళ్ళకి అంతేసి జీతాలు కూడా దండగే అని వ్యాఖ్యానించిన గొప్ప తెంపరి ఈ బాబు అని ఇప్పటికీ ఉద్యోగులు తిట్టుకుంటున్నారు.అంతేకాదు తన పాలనలోనే తొలిసారిగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విధానం తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నిర్వీర్యం చేసిన ఘనత కూడా బాబుదేనని తిట్టుకునే వారున్నారు. ఇప్పటికీ అదే అవుట్ సోర్సింగ్ విధానం ఆంధ్రాలో కొనసాగుతోంది.చివరివరకూ అదే తక్కువ జీతాలతో కొనసాగక తప్పని పరిస్థితి వీళ్ళది.
అసలు ఉచిత సేవలు ఎందుకు? అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసిన టాలెంట్ చంద్రబాబుదేనని ప్రజలు తిట్టుకుంటున్నారు. కమ్యూనిస్టులు సైతం బాబు అవినీతి జమానా గురించి ఓ పుస్తకమే రాశారంటే ఆయన పాలన ఎంత డొల్ల అనేది అర్ధమవుతుంది.

అటు ప్రభుత్వరంగ విద్యావ్యవస్థను కూడా నిర్వీర్యం చేసిన ఘనుడు ఈ బాబేనని విమర్శలు వినిపిస్తున్నాయి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పిన చంద్రబాబు ఇబ్బడి ముబ్బడిగా కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించారు. దీంతో ప్రభుత్వ స్కూళ్ళు,కళాశాలలు మూటపడటం బాబు పాలనలోనే ప్రారంభమయ్యాయి. ఇలాంటి వ్యక్తులను స్విట్జర్లాండ్ లో అయితే జైల్లోకానీ, పిచ్చాసుపత్రిలో కానీ పెట్టేవాల్లమ్ అని ఆ దేశ మంత్రి పాస్కల్ వ్యాఖ్యానించారు. అంతటి ఘనుడు ఈ చంద్రబాబు అని విశ్లేషకుల మాట.

అసలు చంద్రబాబుకి విజనే ఉంటే ఏపీ విడిపోయేది కాదని వ్యాఖ్యానించే వారు కూడా ఉన్నారు.విడిపోయిన రాష్ట్రానికి కొత్తగా రాజధాని ఎందుకు అని ఆలోచించి ఉంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమరావతి పేరిట గ్రాఫిక్స్ చేసేవారు కాదు.అన్నివిధాల అభివృద్ధి చెందిన విశాఖ రాజధాని అయ్యేది. కానీ బాబు అనుకున్నదే జరగాలి తన అనుచరులు లాభపడాలి కాబట్టి అమరావతిలో గ్రాఫిక్స్ మేడలు కట్టారు.మూడు పంటలు పండే పచ్చని భూములను రాజధానికి సేకరించి దాన్ని సొంత రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చేశారని రైతులు విమర్శిస్తున్నారు.చంద్రబాబుకు ప్రజల మీద ప్రేమ లేదు కాబట్టే తన అనుచరులు, అనుయాయుల లబ్ది కోసమే ఆలోచనలు చేస్తున్నారని వైసీపీ నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version