అలంటి పోస్టులు పెట్టొద్దు…డీజీపీ విజ్ఞప్తి !

-

సోషల్‌ మీడియా పోస్టుల పట్ల చాలా జాగ్రత్త వహించాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణా ప్రజలకి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత దారుణానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తేటతెల్లం అయిందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజలను కోరారు.

 

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ సోషల్‌ మీడియాలో ఓ వర్గానికి చెందిన దేవుడిని కించపరిచేలా ఒక పోస్టు షేర్‌ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు మరణించారు. ఈ అల్లర్లలో సామాన్య ప్రజానీకం సహా 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news