కమలం హవాను అడ్డుకోవడం ఇండియా కూటమికి కష్టమేనా..? ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే..

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతంగా మారాయి. ఎన్డీఏ హవాను అడ్డుకునేందుకు దేశంలో ఉండే సుమారు 30 పార్టీలతో కాంగ్రెస్ జతకట్టినా.. ప్రయోజనం లేకుండాపోతోంది.. గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను చూస్తే బీజేపీతో ఫేస్ టు ఫేస్ తలపడిన.. ప్రతిసారి బిజేపీని ఆధిపత్యం సాధిస్తోంది.. తాజాగా జరిగిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగా బీజేపీని ఢీకొట్టలేక హర్యానాలో చతికిలపడగా.. జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీతో పొత్తుపెట్టుకుని.. గెలుపును సొంతం చేసుకుంది..

జమ్మూలో కాంగ్రెస్, బిజేపీ నేరుగా తలపడిన చోట్ల కూడా కమలానిదే పైచేయిగా ఉంది.. కాంగ్రెస్ పోటీ చేసిన 39 సీట్లలో కేవలం 6 సీట్లు మాత్రమే గెలిచింది.. కాంగ్రెస్ గెలిచిన సీట్లలో ఒక్కటి కూడా హిందూ జనాభా ఎక్కువగా ఉన్న సీటు లేదు. గెలిచిన అభ్యర్థుల్లో ఒక్కరు కూడా హిందువు లేరు. దీన్ని బట్టి కాంగ్రెస్ గెలిచిన సీట్లు కూడా.. ఎన్సీ పుణ్యమేనని స్పష్టమవుతోంది..

హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, బహుజన్ సమాజ్ పార్టీలలో ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకున్నా పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయం కాంగ్రెసో్ నేతల్లోనే వ్యక్తమవుతోంది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ సాధించిన ఓట్ల శాతంలో వ్యత్యాసం 1 శాతం కంటే తక్కువే. బీజేపీ 39.94% ఓట్లతో 48 సీట్లు గెలుపొందగా, కాంగ్రెస్ 39.09% ఓట్లు సాధించినప్పటికీ 37 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆప్ (1.79%), బీఎస్పీ (1.82%), ఐఎన్ఎల్డీ (1.14%) ఓట్లు సాధించాయి. దీన్ని బట్టి చూస్తే.. సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ బిజేపీని ఎదుర్కోవడం కష్టమనేది అర్దమవుతోంది..

గతంలో మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీతో కాంగ్రెస్ నేరుగా తలపడి ఓటమిపాలైంది. ఉత్తరాదిన హిమాచల్‌లో మాత్రమే గెలుపొందగలిగింది. తెలంగాణలో విజయం సాధించినప్పటికీ.. అక్కడ బిఆర్ఎస్, వామపక్షాలతో పోటీ పడి గెలిచింది.. ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారి.. సింగిల్ గా కాంగ్రెస్ గెలవలేకపోతోంది.. మొత్తంగా.. ఎన్డీఏ హవాను తట్టుకోవడం సింగిల్ గా కాంగ్రెస్ కు గానీ.. ఇండియా కూటమికి గానీ సాధ్యం కాదనే వాదన తెరమీదకు వస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version