ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా డీఎస్సీ ఆగలేదు – డిప్యూటీ సీఎం భట్టి

-

ప్రతిపక్షాలు డీఎస్సీ పై ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఆటంకాలు సృష్టించినా అనుకున్న సమయానికి డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేశామని అన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. బుధవారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమంలో పాల్గొన్న భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసమే ప్రత్యేక తెలంగాణ పోరాటం జరిగిందని, అయినా గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఎలాంటి చర్య తీసుకోలేదని విమర్శించారు.

దశాబ్ద కాలం డీఎస్సీ గురించి ఆలోచన చేయలేదని మండిపడ్డారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే తపనతోనే టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నామన్నారు భట్టి. ఏళ్ల తరబడి పదోన్నతులు, బదిలీలు లేక టీచర్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారని.. తమ ప్రభుత్వం రాగానే టీచర్ల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేసిందన్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలను అందజేసిందని అన్నారు. అలాగే 65 రోజులలోనే డీఎస్సీ నియామకాలను పూర్తి చేశామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version