ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు.
అయితే.. ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో పోస్ట్ బ్యాలెట్లు ఓట్లు అత్యధికంగా నమోదయ్యాయట. పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ సర్వీస్ ఓట్ల వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఏపీలోని లోక్ సభ నియోజకవర్గాల్లో మొత్తం 28,662 పోస్టల్ సర్వీస్ ఓట్లు పోలవగా.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29,592 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి.
జిల్లాల వారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇవే…
శ్రీకాకుళం – 8,121 ఓట్లు
విజయనగరం – 2,564 ఓట్లు
విశాఖపట్నం – 3,333 ఓట్లు
తూర్పుగోదావరి – 923 ఓట్లు
కృష్ణా – 457 ఓట్లు
గుంటూరు – 3,036 ఓట్లు
ప్రకాశం – 3,765 ఓట్లు
నెల్లూరు – 362 ఓట్లు
వైఎస్సార్ కడప – 1,175 ఓట్లు
కర్నూలు – 1,935 ఓట్లు
అనంతపురం – 1,676 ఓట్లు
చిత్తూరు – 2,185 ఓట్లు