గురుకులాల్లో కుక్క, పాముకాట్లు.. వారి ప్రాణాలను రక్షించండి : హరీశ్ రావు

-

రాష్ట్రంలో గురుకులాల పనితీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సీరియస్ అయ్యారు.నల్గొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన వార్త తనను తీవ్రంగా కలిచివేసిందని ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.కాంగ్రెస్ పాలనలో బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన పిల్లలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రుల పాలవ్వడం సిగ్గుచేటన్నారు.గురుకులాల్లో కుక్కకాట్లు, ఎలుక కాట్లు, పాము కాట్లు సర్వసాధారణం అయ్యాయని మండిపడ్డారు.

విద్యాశాఖ ప్రక్షాళన అంటూ ప్రగల్భాలు పలకడం మాని గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించి, సరైన విద్యాబోధన అందించాలని.. అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు.విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు తన వద్దనే ఉన్నా సీఎం ఏనాడూ వాటి మీద సీమీక్ష చేయలేదన్నారు. రేవంత్ నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version