విజయోత్సవ సభకు ఉత్తమ్, తుమ్మల, మాధవ రెడ్డి డుమ్మా? – ఎర్రబెల్లి సెటైర్లు

-

రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్.. చీటర్..కబ్జాకోరు అంటూ మరోసారి రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీశారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. అదో ఏడాది ఉత్సవమా? విజయోత్సవ సభకు మంత్రులు ఉత్తమ్, తుమ్మల వచ్చారా? అంటూ ఆగ్రమించారు. వరంగల్ ఎమ్మెల్యే మాధవ రెడ్డి పాల్గొన్నారా? సిగ్గు లేదు..మీ పార్టీ నేతలనే సమన్వయం చేసుకోవడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వరంగల్‌ టూర్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు.

errabelli dayakar rao revanth reddy

రేవంత్.. సిగ్గుందా నీకు? అంటూ ఆగ్రహించారు. కాళోజి కళాక్షేత్రం కోసం కేటాయించిన స్థలం ఇదివరకు ఎవరి కబ్జాలో ఉన్నది? అంటూ ఫైర్‌ అయ్యారు. మీ కాంగ్రెస్ నేతల కబ్జాలో ఉంటే పోరాడింది మేము..ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతావా? అంటూ నిప్పులు చెరిగారు ఎర్రబెల్లి.
అవును..బరాబర్ నేను రాక్షసుడినేనని.. ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తా! అన్నారు. ఏడుసార్లు గెలిచాను నేను.. నువ్వు గెలిచినచోట మళ్లీ గెలవవ్ అంటూ చురకలు అంటించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version