ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై ఆగ్రహంగా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టి టిడిపిని కాపాడటానికి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన కులం పేరుతో కావాలనే అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘంని అడిగే నిర్ణయం తీసుకున్నా అని, అదే విధంగా వైసీపీ నాయకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.కోర్టులో పరువునష్టం దావా వేసేందుకు రమేష్ కుమార్ సహా ఎన్నికల సంఘం కొందరు అధికారులు కూడా సిద్ధమైనట్లు సమాచారం.
ఎన్నికల సంఘానికి కొన్ని మీడియా చానళ్లు పదేపదే కులానికి అంటగడుతూ వ్యాఖ్యలు చేస్తున్నారని వాటి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి, అంబటి రాంబాబు, ఆర్.కె.రోజా ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా పలువురి పేర్లను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కూడా సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి.