చిక్కుల్లో పడ్డ దిల్ రాజు.. అది జరగడం కష్టమే!

-

స్టార్ హీరోలతో సినిమా అంటేనే కత్తిమీద సాములా తయారైంది వ్యవహారం. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి వారితో సినిమా అంటే మరింత కష్టమే. పవన్ చెప్పింది టైమ్, చేసిందే సీన్ అన్నట్టు వ్యవహరం జరుగుతుందని టాక్. తాజాగా ఇలాంటి తలనొప్పులను దిల్ రాజు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయన నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమా చిక్కుల్లో నెట్టేలా కనిపిస్తోంది. ఇంతకీ అసలు సంగతేంటో ఓ సారి చూద్దాం.

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో భారీ క్రేజ్ ఉంటుందన్న నేపథ్యంలో దిల్ రాజు ఓ రేంజ్‌లో ముట్టజెప్పాడని తెలుస్తోంది. దాదాపు 40కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. అయితే వకీల్ సాబ్‌ కోసం పవన్ తక్కువ మొత్తంలో డేట్స్ ఇచ్చినట్టు, అందులోనే అడ్జస్ట్ చేసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి క్రిష్ మూవీ షూటింగ్‌లో పాల్గొననుండటంతో మార్చిలోనే వకీల్ సాబ్ పూర్తి చేయాలని దిల్ రాజు భావించాడట.

అయితే కరోనా వైరస్ ప్రభావం చూపుతుండటంతో షూటింగ్స్‌ను పూర్తిగా నిలిపివేయాలని టాలీవుడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వకీల్ సాబ్ సినిమా ఆగిపోయింది. ఏప్రిల్‌లో మళ్లీ షూటింగ్‌లు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అప్పటికి పవన్ డేట్స్ ఏఎమ్ రత్నం దగ్గర ఉంటాయి. మరి ఆయన ఒప్పుకుంటే కానీ పవన్ డేట్స్ దిల్ రాజు చేతికి రావు. మరి వ్యవహారం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. పరిస్థితి చూస్తుంటే ముందుగా అనున్నట్టుగా వకీల్ సాబ్ మే 15న వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వకీల్ సాబ్ దిల్ రాజును చిక్కుల్లో పడేసేలానే ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version