పెన్షన్ల పంపిణీపై కీలక అప్డేట్… ఈసారి అవ్వా తాతలకు ఇబ్బందులుండవ్

-

పెన్షన్ల పంపిణీపై గత నెల టీడీపీ ప్రదర్శించిన అత్యుత్సాహంతో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా పెన్షన్ తీసుకునే క్రమంలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈసారి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చింది. వృద్ధులకు పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించింది. గత పెన్షన్ల పంపిణీ విషయంలో చాలా పిర్యాదులు వచ్చాయని గుర్తు చేసిన ఎన్నికల సంఘం.. గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కాగా పాటించాలని సూచించింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని.. కుదరని పక్షంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. గతంలో మాదిరి గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను పెన్షన్ల పంపిణీకి ఉపయోగించుకోవాలని ఈసీ సూచించింది.

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో.. పెన్షన్లు పొందేవారికి ఇబ్బంది లేకుండా చూడాలని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు పేర్కొంది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డికి ఈసీ స్పష్టం చేసింది. పంపిణీకి పర్మనెంట్ ఎంప్లాయిస్‌ను వినియోగించుకోవాలని పేర్కొంది. పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఇవ్వడానికి.. వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఎంప్లాయిస్‌ను వినియోగించుకోవాలని ఈసీ స్పష్టంగా ఆదేశించింది.

రాష్ట్రంలో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 నుంచే సూర్యుడు ఠారెత్తిస్తున్నాడు. మే తొలి వారంలొ 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఎండలు, వడగాలులు, తీవ్ర ఉక్కపోత కారణంతా జనాలు బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల్లో వృద్ధులు, దివ్యాంగులు గ్రామ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవడమంటే ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలోనే సకాలంలో డబ్బు రెడీగా ఉంచుకోవడంతో పాటు, లబ్ధిదారుల ఇళ్లకే పంపిణీ జరిగేలా చర్యలు చేపడితేనే.. వారంతా ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉందని సూచించింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news