కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ఎన్నిక నేడే

-

స్థానిక సంస్థల ఎన్నిక‌ల స‌మ‌యంలో మొద‌లైన కొండ ప‌ల్లి మున్సిప‌ల్ ఉత్కంఠ కు ఈ రోజు తెర ప‌డ‌నుంది. ఈ రోజే కొండ ప‌ల్లి మున్సిపాలిటీ కి ఛైర్మెన్ ను ఎన్నుకొనున్నారు. హై కోర్టు ఆదేశాల‌తో ఈ రోజు ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అలాగే ఎంపీ కేశినేని నాని ఎక్స్ ఆఫిసియో ఓటు పై కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ హై కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

మున్సిప‌ల్ చైర్మెన్ ఎన్నిక లో ఎంపీ కేశినేని నాని ఎక్స్ ఆఫిసియో ఓటు ను వినియోగించు కోవ‌చ్చ‌ని తెల్చింది. అయితే ఎంపీ కేశినేని నాని ఓటు ను పరిగ‌ణ లో కి తీసుకోవాలా.. లేదా అనేది హై కోర్టు నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఫ‌లితాల ను నిలిపివేయాల‌ని రిట‌ర్నింగ్ అధికారిని ఏపీ హై కోర్డు ఆదేశించింది. కాగ కొండ‌ప‌ల్లి పీఠాన్ని కైవ‌లం చేసు కోవ‌డానికి అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ లు పోటీ ప‌డుతున్నాయి. కాగ ఎంపీ కేశినేని ఎక్స్ ఆఫిసియో ఓటు ను ప‌రిగ‌ణ లోకి తీసుకుంటే మాత్రం టీడీపీ విజ‌యం సాధించే అవ‌కాశాలు ఎక్కువ గా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news