కొత్త పార్టీపై ఈట‌ల క్లారిటీ.. నిజ‌మేనా?

-

మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ వ‌రుస‌గా కాంగ్రెస్‌, బీజేపీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం ఎన్నో అనుమానాల‌కు దారి తీసింది. ఆయ‌న ఆయా పార్టీల్లో చేర‌తారంటూ వార్తులు కూడా వచ్చాయి. ఇంకోవైపు సొంత పార్టీ పెడ‌తారంటూ వినిపించింది. కానీ అస‌లు వాట‌న్నింటిపై ఈట‌ల రాజేంద‌ర్ నిన్న క్లారిటీ ఇచ్చారు.

ఓ న్యూస్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఈట‌ల రాజేంద‌ర్ ఎన్నో విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేర‌బోన‌ని, సొంత పార్టీ కూడా పెట్ట‌నంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు. అయితే ఆయ‌న ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఛాన‌ల్ బీజేపీది కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.

కాక‌పోతే త‌న పోరాటం ఆత్మ‌గౌర‌వం కోస‌మ‌ని చెప్పారు. హుజూరాబాద్‌లో ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తాన‌ని, త‌న ద‌మ్మేంటో చూపిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు చేసినా హుజూరాబాద్ ప్ర‌జ‌లనే న‌మ్ముకున్నాన‌ని వివ‌రించారు. ఉద్య‌మాల‌కు ఊపిరిపోసిన హుజూరాబాద్‌లోనే గెలుస్తాన‌ని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version