నిన్న చంద్రబాబు కాళ్లు మొక్కాడు.. ఇవాళ గుడ్ బై చెప్పాడు..!

-

రాజకీయాలంటే అంతే బాసు.. అందితే తల లేకపోతే కాళ్లు పట్టుకోవడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య…

ఏపీలో రాజకీయాలు ఎలా మారుతున్నాయంటే.. క్షణక్షణం ఉత్కంటే. ఏం జరుగుతుందో.. ఏం జరగబోతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే టీడీపీలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ టీడీపీని వీడారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీలో చేరిన కొన్ని రోజులకే పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ తరుపున టికెట్ ఆశించారు. అందుకే టీడీపీలో చేరారు. కానీ.. ఇటీవలే టీడీపీ ప్రకటించిన జాబితాలో హర్షకుమార్ పేరు లేదు. దీంతో ఆయన తీవ్రంగా అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే టీడీపీకి రాజీనామా చేశారు.

అయితే.. ఈయన టీడీపీలో చేరిన సమయంలో చంద్రబాబు కాళ్లు మొక్కారు. అదే అప్పుడు, ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీటు కోసం ఎంతకైనా తెగిస్తారా? సీటు ఇవ్వాలని అప్పుడు కాళ్లు పట్టుకున్నావు. ఇప్పుడు సీటివ్వలేదని మెడ పట్టుకుంటావా? అందుకే టీడీపీకి రాజీనామా చేశావా? అంటూ ఏపీ ప్రజలు హర్షకుమార్ పై దుమ్మెత్తిపోస్తున్నారట. దళితులు, ప్రజా సంఘాలు కూడా ఆయన చంద్రబాబు కాళ్లు పట్టుకున్నప్పుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.



మరోవైపు.. ఆయన పార్టీని వీడిన అనంతరం… సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు ఒక్కటే అంటూ బాంబు పేల్చారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు దమ్ముంటే టీడీపీతో పొత్తు లేదని దేవుడిపై ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. జనసేన, కాంగ్రెస్, బీఎస్పీ టికెట్లను టీడీపీ ఖరారు చేస్తోందంటూ మండిపడ్డారు.

ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదని.. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మీరు మాత్రం మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి.. అంటూ హర్షకుమార్ తన అనుచరులకు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version