హత్యపై మంత్రులు నోరు జారారు.. అభాసుపాలయ్యారు.. టీడీపీ నేత హత్య కేసులో సంచలన నిజాలు..

-

కర్నూల్ జిల్లాలో జరిగిన టీడీపీ నేత హత్య నిన్నటి దాకా రాజకీయ దుమారం రేపింది.. వైసీపీ నేతలే తమ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ ను హత్య చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు.. నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలంటూ డిమాండ్ చేశారు.. ఈ క్రమంలో మంత్రి నారాలోకేష్ తో పాటు.. హోంమంత్రి అనీత కూడా స్పందించారు.. వైసీపీ నేతలు పాత పంథాను ఇంకా మరిచిపోలేదని.. వారిపై చర్యలు తీసుకుంటామంటూ లోకేష్ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ ఆయన మెడకే చుట్టుకుంది..

కర్నూల్ జిల్లా పత్తికొండ మండలంలో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యకు గురయ్యారు… కళ్లలో కారం చల్లిదారుణంగా హత్య చేశారు.. ఇది రాజకీయ రంగు పులుముకుంది.. వైసీపీ నేతలే ఈ హత్య చేశారంటూ ప్రచారం జోరందుకుంది.. హత్య కేసును కర్నూల్ జిల్లా పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు.. ఎస్పీ బిందు మాధవ్ ఘటనాస్థలానికి వెళ్లి కీలక ఆధారాలు సేకరించారు.. పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. అధికార పార్టీకే దిమ్మె తిరిగేలా షాకింగ్ నిజాన్ని చెప్పేశారు.. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడుగా ఉన్న మృతున్ని టీడీపీ నేత నరసింహులే హత్య చేశారని వెల్లడించారు.

మృతుడు శ్రీనివాసులకు. హత్య చేసిన నరసింహులకు పాత గొడవలున్నాయట.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శ్రీనివాసులకు నామినెటెడ్ పదవి దక్కుతుందన్న ప్రచారం ఊపకుంది.. దీంతో అతన్ని నరసింహులు హత్య చేశారు.. స్వంత పార్టీ నేతే హత్య చేస్తే.. దాన్ని వైసీపీకి ఆపాదించాలని మంత్రి లోకేష్ ప్రయత్నించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.. మంత్రి స్థాయిలో ఉండి.. ఇలాంటి అనాలోచిత స్టేట్మెంట్స్ ఇవ్వడంపై స్వంత పార్టీ నేతలు కూడా ఆయన్ని విమర్శిస్తున్నారట.. నోరు జారి అభాసుపాలయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version