777 రూల్ అంటే ఏంటీ..? దీని వలన భార్యాభర్తలు ఎల్లప్పుడూ ఎలా సంతోషంగా ఉంటారంటే..?

-

777 rule: భార్యాభర్తలు మధ్య ప్రేమానురాగాలు ఉంటే వాళ్ల బంధం ఎప్పుడు బాగుంటుంది. చాలామంది భార్య భర్తల మధ్య ప్రేమ తగ్గిపోవడం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, కమ్యూనికేషన్ గ్యాప్.. ఇలా పలు కారణాల వలన భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలన్నా, వాళ్ళ బంధం బాగుండాలన్నా కచ్చితంగా 777 రూల్ పాటించాలి. అసలు ఈ 777 రూల్ ఏంటి..? అసలు దీని వలన ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి. ప్రతి ఏడు రోజుల తర్వాత ఒకసారి డేట్ నైట్. ప్రతి ఏడు వారాల తర్వాత ఒక స్పెషల్ ప్లాన్. ప్రతి ఏడు నెలలకి ఒక లాంగ్ వెకేషన్ వంటివి ప్లాన్ చేసుకోవాలి.

ఇది నిజంగా భార్య భర్తలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి ఎప్పుడూ కూడా భార్య భర్తలు నాణ్యమైన సమయాన్ని గడపడానికి చూసుకోవాలి. అప్పుడే వాళ్ళ మధ్య బంధం బాగుంటుంది. బంధం దృఢంగా ఉంటుంది. ప్రేమ పెరుగుతుంది. ఇలా చేయడం వలన వాళ్ళ మధ్య రొమాన్స్ జీవించి ఉంటుంది. రొమాన్స్ జీవించి ఉండడం వలన రిలేషన్షిప్ బలంగా మారుతుంది. ఎప్పుడూ కూడా ఇలా 777 ని ప్లాన్ చేసుకోవడం వలన ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది.

ఒకరి భావాలని మరొకరితో పంచుకోవడానికి అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు పైగా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. రొమాంటిక్ గా లైఫ్ ని సాగించడానికి ఈ సెవెన్ సెవెన్ సెవెన్ రూల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎప్పుడూ ఒకరితో ఒకరు సమయాన్ని షేర్ చేసుకోవడం వలన ఎమోషనల్ గా ఫిజికల్ గా కనెక్ట్ అయి ఉండగలరు. భార్యాభర్తల మధ్య బంధం బాగుంటే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇక ఈ రూల్ ని గుర్తు పెట్టుకుని వీటిని ఫాలో అవ్వండి ఇక ఎల్లప్పుడూ మీ ప్రేమ చిగురుస్తూనే ఉంటుంది మీ బంధం బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version