ఏపీ ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఫలితాల లెక్కింపు కోసం అన్ని ఏర్పాటు చకచకా అయిపోయాయి. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే.. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలే ముందుగా తెలుస్తాయట.
ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో కేవలం 13 రౌండ్లలోనే ఓట్ల లెక్కింపు ముగుస్తుంది. దీంతో వాటి ఫలితాలు ముందుగా తెలిసిపోతాయి. ఈ రెండిట్లో ఎవరు గెలుస్తారో తెలిస్తే.. దాన్ని బట్టి ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేయొచ్చు.
కర్నూలు నియోజకవర్గంలో అత్యధికంగా 33 రౌండ్లు ఉన్నాయి. దీని వల్ల దాని ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు.. పులివెందుల, నందిగామ, ఆళ్లగడ్డ, పెనమలూరు. గన్నవరం నియోజకవర్గాల లెక్కింపు కూడా 30 రౌండ్ల కంటే ఎక్కువే. దీంతో వాటి ఫలితాలు రావడం కూడా కాస్త లేట్ అవుతుంది.